
విమెన్స్ సింగిల్స్‌లో నిరాశ పరిచిన ఇటలీ ప్లేయర్ జాస్మిన్ పౌలిని డబుల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్లో రెండోసీడ్ సారా ఎరానీ–జాస్మిన్ జోడీ 6–4, 2–6, 6–1తో అనా డానిలినా (కజకిస్తాన్)–అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా)పై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.