గురుకుల హాస్టల్లో ఫుడ్ ఫాయిజన్.. 30 విద్యార్థినీలకు అస్వస్థత

గురుకుల హాస్టల్లో ఫుడ్ ఫాయిజన్.. 30 విద్యార్థినీలకు అస్వస్థత

తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో గత కొన్ని రోజులుగా ఫుడ్ ఫాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి.  నాణ్యత లేని ఫుడ్, కలుషితమైన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. సెప్టెంబర్ 14న నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో   40 మందికి పైగా విషాహారం తిని అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే.

ఈ ఘటన మరువక ముందే  సెప్టెంబర్ 16న  రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని  బీసీ బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. 30 మంది  విద్యార్థినీలు  స్వల్ప అస్వస్థతకు గరయ్యారు. వెంటనే విద్యార్థులను  స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు.

ALSO READ: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఆర్వీ కర్ణన్

అయితే భోజనంలో బొద్దింకలు కనిపించాయని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు.  ఇదంతా హాస్టల్స్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  విద్యార్థులకు నాణ్యతమైన ఆహారం అందించాలని కోరారు.