డెన్మార్క్ తెలంగాణ సంఘం అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా వాసి

డెన్మార్క్ తెలంగాణ సంఘం అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా వాసి

సూర్యాపేట, వెలుగు: డెన్మార్క్ దేశంలో ‘ తెలంగాణ సంఘం’ అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన గిలకత్తుల ఉపేందర్ గౌడ్ ఎన్నికయ్యారు. ఆయన ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు.  

ఉపేందర్ తండ్రి దివంగత గిలకత్తుల చిన జీడయ్య రిటైర్డ్ టీచర్, తల్లి గృహిణి. బీసీఏ చదివిన ఉపేందర్ ఉన్నత చదువుల కోసం డెన్మార్క్ వెళ్లి, మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే జాబ్ లో స్థిరపడ్డారు. మాతృ భూమిపై ఉన్న మమకారంతో అక్కడి తెలంగాణ ప్రొఫెషనల్స్ ను ఐక్యం చేసి తెలంగాణ సంఘం స్థాపించారు.  ఆ సంఘానికి ఉపేందర్ అధ్యక్షుడిగా శనివారం ఎన్నికయ్యారు.