V6 News

2047 నాటికి గ్లోబల్ టూరిజం హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెలంగాణ..ఇదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం: మంత్రి జూపల్లి

2047 నాటికి గ్లోబల్ టూరిజం హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెలంగాణ..ఇదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం: మంత్రి జూపల్లి

హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. 2047 నాటికి తెలంగాణను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సోమవారం ఆయన హిమాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యాట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క అభివృద్ధి సంస్థ(టీజీటీడీసీ) కార్యాలయంలో చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.274.93 కోట్లతో చేపట్టిన పనులతో పాటు కేంద్ర ప్రాయోజిత స్వదేశీ దర్శన్, ప్రసాద్ వంటి పథకాల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ..ఆధ్యాత్మిక, వారసత్వ, ఎకో-వెల్నెస్, జల పర్యాటక సర్క్యూట్ల కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రూపొందించాలని అధికారులకు సూచించారు. నాగార్జునసాగర్, రామప్ప, యాదగిరిగుట్ట వంటి ప్రాంతాలకు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.