హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లపై ఎలాంటి గడువు లేదు: రవాణా శాఖ

హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లపై ఎలాంటి గడువు లేదు: రవాణా శాఖ

హైదరాబాద్: పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ లను బిగించేందుకు ప్రభుత్వం ఎటువంటి గడువు విధించలేదని తెలంగాణ రవాణాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. "సెప్టెంబర్ 30 లోగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ తప్పనిసరిగా బిగించకపోతే ఆర్టీఏ, ట్రాఫిక్ అధికా రులు జరిమానాలు విధిస్తారు” అనే వార్తలు నిజం కాదని తెలిపింది.  

ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇంత వరకు రవాణా శాఖకు అందలేదని తెలిపింది. ఈ విషయం ప్రభుత్వ పరిశీల నలో ఉందని పేర్కొంది. దీనిపై వాహన దారులు ఎలాంటి ఆందోళన చెంద వద్దని సూచించింది. అదేవిధంగా, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ బిగిస్తా మని కొంతమంది నకిలీ వెబ్ సైట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్ద ని తెలిపింది. ఆర్టీఏ చలాన్ల పేరిట వచ్చే అనుమానాస్పద లింక్లను ఎట్టి పరిస్థితు ల్లోనూ ఓపెన్ చేయరాదని రవాణా శాఖ
సూచించింది.