మానిటరీ బెనిఫిట్స్లో10 కోట్లు చెల్లింపు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మానిటరీ బెనిఫిట్స్లో10 కోట్లు చెల్లింపు  : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: మానిటరీ బెనిఫిట్స్ కు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10కోట్లకు పైగా చెల్లించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మానిటరీ రిలీఫ్ కు సంబంధించిన కేసులు ఏండ్ల తరబడి పెండింగ్ లోనే ఉన్నాయని ఆరోపించారు. నిధుల కొరత పేరుతో బాధితులకు న్యాయం దక్కలేదని మంత్రి పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి పరిహారాల ఆలస్యం కారణంగా బాధితులు కార్యాలయాల చుట్టూ తిరగడం అప్పటి పాలనలో సాధారణంగా మారిందని చెప్పారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మానిటరీ రిలీఫ్ అంశాన్ని సామాజిక న్యాయానికి కేంద్రబిందువుగా మార్చిందని,  బాధితులకు సమయానుకూలంగా పరిహారం అందించడమే లక్ష్యంగా పారదర్శకమైన, బాధ్యతాయుతమైన విధానాలను అమలు చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31 వరకు 1080 మందికి  రూ. 10.32 కోట్లు చెల్లించామని  తెలిపారు. 

దివ్యాంగులకు అండగా ఉంటా

లూయిస్ బ్రెయిలీ  సమాజానికి వెలుగు చూపిన మహనీయుడని  మంత్రి అడ్లూరి లక్ష్మణ్  అన్నారు. ఆదివారం బ్రెయిలీ జయంతి సందర్భంగా మలక్ పేట లోని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో బ్రెయిలీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దివ్యాంగులకు తోడుగా నిలుస్తానని ఆయన భరోసా ఇచ్చారు.