జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

మల్కాజిగిరి, వెలుగు: జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అడహక్ కమిటీ కన్వీనర్ పిల్లి రామచందర్, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య విజ్ఞప్తి చేశారు. ఆదివారం నేరేడ్​మెట్ లోని ఎస్ ఎస్ ఫంక్షన్ హాల్ లో టీడబ్ల్యూజేఎఫ్​ మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా మూడో మహాసభ ఘనంగా నిర్వహించారు.. 

జిల్లా కన్వీనర్ గుమ్మడి హరిప్రసాద్ అధ్యక్షత జరిగిన మహాసభలో వారు మాట్లాడారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తేవాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి సలీమ, జిల్లా కో కన్వీనర్ పి.మల్లేశ్​, బానోతు రవి, పి మోహన్ రెడ్డి, కొండ స్వామి , జి రోజా రాణి  తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి.మల్లేశ్, ఉపాధ్యక్షులుగా జి.రోజారాణి, ఎం.రాంబాబు, నరేంద్ర, కార్యదర్శిగా బానోతు రవి ఎన్నికయ్యారు.