మే 7 నుంచి తెలంగాణ రెజ్లింగ్ పోటీలు.. ఈసారి అమ్మాయిలకూ అవకాశం 

మే 7 నుంచి తెలంగాణ రెజ్లింగ్ పోటీలు.. ఈసారి అమ్మాయిలకూ అవకాశం 
  • ప్రైజ్ మనీ  రూ.3 లక్షలు, వెండి గద
  • అంజన్ కుమార్ యాదవ్ వెల్లడి

బషీర్​బాగ్, వెలుగు: ఎల్బీ స్టేడియంలో మే 7 నుంచి 10 వరకు ‘తెలంగాణ కేసరి 2026’ పేరుతో ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు. శుక్రవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్​లో అసోసియేషన్ సెక్రటరీ జనరల్ గౌరవ్ రోషన్ లాల్ సచిదేవ్​తో కలిసి ఆయన ఈ వివరాలను వెల్లడించారు. 

ఈసారి పురుషులతో పాటు తొలిసారిగా ‘తెలంగాణ కుమారి’ పేరిట మహిళలకు కూడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 500 మంది రెజ్లర్లు పాల్గొనే ఈ పోటీల్లో పురుషుల విజేతకు రూ. 3 లక్షల నగదుతో పాటు వెండి గదను, మహిళా విజేతకు రూ. లక్ష నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్లు వివరించారు. ఈ వేడుకకు సీఎంతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులందరినీ ఆహ్వానిస్తున్నట్లు అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.