ఇంటర్ బోర్డు ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం

ఇంటర్ బోర్డు ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం

ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ నుండి బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు గాంధీ భవన్ గేట్ వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు యూత్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీచైతన్య విద్యాసంస్థల అనుమతులు రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విద్యాసంస్థలలో వరుస ఘటనలు జరుగుతున్నా.. ఇంటర్ బోర్డ్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. రేపటి నుంచి అన్ని శ్రీచైతన్య విద్యాసంస్థల ముందు నిరసన చేపడతామని యూత్ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.