ఫేక్ సర్టిఫికెట్లతో ఆర్మీలో ఉద్యోగాలు..ఆదిలాబాద్ లో ఆరుగురు అరెస్ట్

ఫేక్ సర్టిఫికెట్లతో ఆర్మీలో ఉద్యోగాలు..ఆదిలాబాద్ లో ఆరుగురు అరెస్ట్

ఆదిలాబాద్ జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్లతో ఆర్మీలో ఉద్యోగాలు పొందడం కలకం రేపుతోంది.   ఇచ్చోడ మండలం  ఇస్లాంనగర్ లో ఫేక్ సర్టిపికేట్లతో  ఆర్మీలో  ఉద్యోగాలు పొందిన ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.   ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆరుగురు యువకులు తెలంగాణ స్థానిక కోటాలో   ఇండో టిబెట్ అర్మీలో  ఉద్యోగాలు  పోందారు . ఎస్ బి పోలీసుల విచారణలో  ఈ విషయాలు బయటపడ్డాయి.   ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో  నకిలీ   రెసిడెంట్  సర్టిఫికేట్లు,    బోగస్ ఆదార్  కార్డులతో‌ ఉద్యోగాలు పోందినట్లు పోలీసులు గుర్తించారు.  

కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  ఉత్తర ప్రదేశ్  యువకులకు  సహకరించిన  స్థానికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి, సిరికొండ  మండలాల్లో    బొగస్ సర్టిపికేట్ల దందా సాగుతోన్నట్లు పోలీసులు గుర్తించారు.  ఇంకా ఎంత మంది  ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పోందారనే దానిపై  ఆరాదీస్తున్నారు.