
గుర్తు తెలియని దుండగులు తన ఫేస్ బుక్ పేజీని హ్యాక్ చేసి వివిధ మతాలకు సంబంధించి అభ్యంతరకమైన పోస్టులు చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల ట్వీట్ చేసిన పోస్ట్ లు తాను పెట్టినవి కావని తెలిపింది. దీనికి సంబంధించి ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ నోట్‌ని కూడా షేర్ చేసుకుంది.
యాంకర్ భార్గవి FB అఫీషియల్ అకౌంట్‌తోపాటు మరో అకౌంట్‌ని దుండగులు ఆమె పేరుతో క్రియేట్ చేసినట్టు గుర్తించామని తెలిపారు. సోషల్ మీడియాలో అలర్ట్ గా ఉండాలని.. ఎప్పటికప్పుడు పాస్ వర్డ్ లను మార్చుకోవాలని సూచించారు. భార్గవి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ చెప్పారు.