
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమేషన్ చిత్రం 'మహావతార్ నరసింహ' (Mahavatar Narsimha). మహావతార్ సిరీస్ లో మొదటి భాగమైన ఈ సినిమాను ఈరోజు( జూలై 25, 22025 ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కాంతారా, 'కేజీయఫ్', 'సలార్' వంటి భారీ యాక్షన్ చిత్రాలతో దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈచిత్రాన్ని నిర్మించింది. సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ యానిమేషన్ చిత్రం 'మహావతార్ నరసింహ' ఎలా ఉంది.. కథాంశం ఏమిటీ.. అంచనాలను అందుకుందా.. లేదా అనేది చూద్దాం..
విష్ణు - హిరణ్యకశిపుల యుద్ధం, ప్రహ్లాదుడి కథ
ఈ 'మహావతార్ నరసింహ' చిత్రంలో ప్రహ్లాదుడి చరిత్ర, భగవాన్ విష్ణువుకు , అసుర చక్రవర్తి హిరణ్యకశిపునికి మధ్య జరిగిన పౌరాణిక యుద్ధాన్ని అత్యంత ఆసక్తికరంగా చూపించారు. నరసింహ అవతార వెనుక ఉన్న అసలు కథను, దాని ప్రాముఖ్యతను ఈ యానిమేటెడ్ చిత్రం ద్వారా నేటి తరానికి పరిచయం చేశారని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తనను తాను దేవుడిగా ప్రకటించుకుని, తన కుమారుడితో సహా తన ప్రజల నుండి భక్తిని కోరే కథను ఈ చిత్రం అనుసరిస్తుంది. అయినప్పటికీ, అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుకు అంకితమై, దైవ జోక్యానికి వేదికను ఏర్పాటు చేస్తాడు. ఇది చాలా మందికి సుపరిచితమైన కథ, కానీ ఈ చిత్రం చేయగలిగింది ఏమిటంటే, దీనికి కొత్త భావోద్వేగం, లోతు మరియు వ్యక్తిగత ప్రతిబింబాన్ని కూడా ఇస్తుంది. ట్రైలర్ లో ఏం జరగబోతుందో ఒక గ్లింప్ మాత్రమే ఇచ్చినా.. ఇప్పుడు సినిమా అంచాలను మించిపోయింది. భారతీయ యానిమేషన్ సినిమాల్లోకి ఆశ్చర్యకరమైన , శక్తివంతమైన ప్రవేశాన్ని సూచిస్తుందని సినీ వర్గాలు అభిప్రాపడుతున్నారు. విజువల్స్, గ్రాఫిక్స్ అత్యద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
సినిమాకు బలం..
ఈ యానిమేషన్ మూవీ కొత్త భావోద్వేగం, లోతు , వ్యక్తిగత ప్రతిబింబాన్ని కూడిన విధంగా చూపిస్తుంది. యానియేషన్ ఓ మోస్తరు నిర్మాణ విలువతో ప్రారంభం అవుతుంది. అయితే సినిమా ముందుకు సాగే కొద్దీ యానిమేషన్ క్యాలిటీ బాగా పెరగడంతో కథతో పాటు సినిమాను హైప్ కు తీసుకెళ్తుంది. సెకాండాఫ్ లోకి వచ్చే సమయానికి యానిమేషన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. దీనిలో కొన్ని సన్ని వేశాలు గూస్ బప్స్ ఇచ్చేంత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
బలహీనతలు కొన్నే..
అయితే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ బలహీనమైన అంశాల విషయానికి వస్తే .. వాయిస్ డబ్బింగ్, లిప్ సింక్. కొన్ని చోట్ల పాత్రల ముఖ కవళికలు వాయిస్ ఓవర్ సరిగ్గా సరిపోలేదు. ఇవి భావోద్వేగాన్ని కొంత దెబ్బతీశాయి. చిత్ర నిర్మాతలు యానిమేటెడ్ చిత్రాలను చాలా అరుదుగా నిర్మిస్తారు. ఆలోటును ఈ చిత్రం పూర్తి చేసింది. ఈ సినిమాలో వాయిస్ ఓవర్లు నిజంగా ఆకట్టుకునున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సన్నివేశాన్ని , స్క్రిప్టు చక్కగా తీర్చిదిద్దారు.
ఈ మూవీలో డైలాగులు ప్రత్యేకతను చాటుకున్నాయి. ఎమోషనల్ మూమెంట్స్ ని మసకబారకుండా , సినిమా టోన్ కి పర్ఫెక్ట్ గా సరిపోయేలా చక్కగా కంపోజ్ చేశారు. చక్కటి టైమింగ్ తో అందించిన సంగీతం మరో హైలైట్ గా నిలిచిందని ప్రేక్షకులు వెల్లడించారు. ఇటీవల వచ్చిన పౌరాణిక చిత్రాలతో పోల్చితే' మహావతార్ నరసింహ' మంచి మార్కులు కొట్టేసిందని అంటున్నారు. నరసింహుని రూపం విస్మయాన్ని కలిగించేదిగా తీర్చిదిద్దడంతో పాటు ఆ పాత్రకు దక్కాల్సిన సీరియస్ నెస్ చక్కగా చూపించారని ప్రశంసలు అందుకుంటుంది.
►ALSO READ | SSMB29: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆగస్టు నుంచి 'SSMB29' షూటింగ్ షురూ!
యానిమేషన్ ఓ మోస్తరు నిర్మాణ విలువలతో మొదలవుతుంది. ముఖ్యంగా తొలి సన్నివేశాల్లో విజువల్స్ పరిమితంగా అనిపించవచ్చు. అయితే సినిమా ముందుకు సాగే కొద్దీ యానిమేషన్ క్వాలిటీ బాగా పెరిగి, కథతో పాటు సినిమా కూడా ఎదుగుతుంది. సినిమా సెకండాఫ్ లోకి ప్రవేశించే సమయానికి యానిమేషన్ ఆకట్టుకునే విజువల్ మెచ్యూరిటీకి చేరుకోవడంతో పాటు కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ ఇచ్చేంత పవర్ ఫుల్ గా ఉన్నాయి. కొన్ని చోట్ల ఆడియో సింక్రనైజేషన్ లో టెక్నికల్ గా ఒడిదుడుకులు ఎదురైనా.. సెకండాఫ్ లో ఆకట్టుకుంటుందని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు.
'మహావతార్ నరసింహ' మూవీ అన్ని వయసుల ప్రేక్షకులు మెచ్చుకుంటారు. దీనిలో విజువల్స్, కథను పిల్లలు ఎంజాయ్ చేస్తారు. భక్తి పరమైన అనుభవాన్ని అందిస్తుంది. లోపాలు పెద్దగా లేని ఈ యానిమేషన్ మూవీ అందరి ప్రశంసలు అందుకుంటుంది. పాన్ ఇండియా స్థాయిలో 3డి, 2డి ఫార్మాట్లలో విడులైంది. ఈ చిత్రానికి జయపూర్ణ దాస్, అశ్విన్ కుమార్, రుద్ర ప్రతాప్ ఘోష్ రచయితలుగా వ్యవహరించారు. మొత్తానికి హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఈ యానిమేషన్ మూవీ అన్ని వయసుల వారికి ఆకట్టుకుంటుంది.