
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకదీరుడు ఎస్.ఎస్. రాజమౌళీ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'SSMB29' ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఇటీవల మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో అత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను మేకర్స్ పంచుకోనప్పటికీ .. అభిమానులు మాత్రం ఈ చిత్రం ఎలా ఉండబోతుందనని ఆసక్తి కనబరుస్తున్నారు.
దర్శకుడు రాజమౌళి ఈ సినిమా విషయంలో చాలా పకడ్భందిగా వ్యవహరిస్తున్నారు. ఏయే నటీనటులు నటించబోతున్నారు, సినిమా గురించి కానీ ఎక్కడా లీక్ కాకుండా చాలా గోప్యతను పాటిస్తున్నారు. గతంలో ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను కెన్యాలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. అయితే అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా షూటింగ్ వాయిదా పడింది.
అయితే ప్రస్తుతం మళ్లీ షూటింగ్ ను ప్రారంభించేందుకు చిత్రం బృందం రెడీ అవుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో సహా 'SSMB29' నటీనటులు, సిబ్బంంది విరామంలో ఉన్నారు. మహేష్ బాబు తన కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీలంకలో హాలిడే ట్రిప్ లో ఉన్నారు. వెకేషన్ నుంచి మహేష్ బాబు తిరిగివచ్చిన తర్వాత ఆగస్టులో హై ఆక్టేన్ షెడ్యూల్ కోసం చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ప్రియాంక చోప్రా షూటింగ్ కు కూడా రెడీగా ఉంది.
ఈసినిమా ఇండియా జోన్స్, ఆఫ్రికన్ అడ్వెంచర్ క్లాసిక్ నుంచి ప్రేరణ పొందిన ఒక కఠినమైన అన్వేషకుడిని చూట్టూ తిరుగుతుంది. తెలియని భూబాగం నుంచి ప్రకృతి, రహస్య, శక్తివంతమైన శత్రువులతో పోరాడుతూ.. ప్రపంచాన్ని మార్చగల దీర్ఘకాలంగా కోల్పోయిన రహస్యాన్ని వెలికీ తీయడానికి బయలుదేరుతాడు. దాదాపు రూ. 1000 కోట్ల అంచనా వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. 'SSMB29' లో ప్రియాంక చోప్రాతో పాటు మలయాళయం నటుడు పృథ్వీరాజ్ సుకుమాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
రాజమౌళి గత చిత్రాల విజయాలను చూస్తే, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు తెస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ గురించిన మరిన్ని అధికారిక అప్‌డేట్‌లు, విడుదల తేదీ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఆగస్టు నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. గతం లో కెన్యాలో షూటింగ్ రద్దు అయింది. మరి ఇప్పుడు ఎక్కడ లోకేషన్స్ రెడీ చేశారు అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.