హైదరాబాద్ లో నాన్ స్టాప్ వాన.. నిండు కుండలా హుస్సేన్ సాగర్..

హైదరాబాద్ లో నాన్ స్టాప్ వాన.. నిండు కుండలా హుస్సేన్ సాగర్..

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పలు జిల్లాల్లో ముసురు కొనసాగుతున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పల్లెల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇక హైదరాబాద్​లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

హుస్సేన్​ సాగర్​లో పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా.. రాత్రి వరకు నీటిమట్టం 513.20 మీటర్లకు చేరుకుంది. దీంతో వచ్చిన నీటిని తూముల ద్వారా మూసీలోకి వదులుతున్నారు.