Hari Hara Veera Mallu Box Office: ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

Hari Hara Veera Mallu Box Office: ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

హరిహర వీరమల్లు గురువారం (జులై 24)న ప్రేక్షకుల ముందుకొచ్చి మిక్సెడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సినిమా తొలిరోజు రూ.31.5 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులోనే అత్యధికంగా రూ.31కోట్లు సాధించింది. 

సాక్నిల్క్ ట్రేడ్ వెబ్ సైట్ ప్రకారం..

ఇండియాలో వీరమల్లు ప్రీమియర్ ద్వారా (జులై 23) రూ.12.7 కోట్లు వసూళ్లు చేసినట్లు తెలిపాయి. ఇలా ప్రీమియర్స్, ఫస్ట్ డే వసూళ్లను కలుపుకుని తొలి రోజు ఇండియాలో రూ.44.20 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఓవరాల్గా 'వీరమల్లు' ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో కలిపి రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని వెల్లడించాయి.

అయితే, ఈ 2025లో తొలిరోజు వసూళ్ల పరంగా గేమ్ ఛేంజర్ రూ.54 కోట్లతో ముందంజలో ఉంది. ఆ తర్వాత వీరమల్లు (రూ.31.5 కోట్ల) కలెక్షన్లు చేసిన రెండో చిత్రంగా నిలిచింది. ఈ ఓపెనింగ్ లిస్టులో డాకు మహారాజ్ తొలిరోజు రూ.25.35 కోట్లు, సంక్రాంతికి వస్తున్నాం రూ.23 కోట్లు, హిట్: ది థర్డ్ కేస్- రూ.21 కోట్లు, కుబేరా- రూ.14.75 కోట్లు సాధించాయి. 

ఇకపోతే పవన్ కళ్యాణ్ కెరియర్లో ఫస్ట్ డే ఓపెనింగ్ లెక్కలు చూసుకుంటే.. బ్రో మూవీ రూ.30.5 కోట్లు, భీమ్లా నాయక్ రూ.37.15 కోట్లు, వకీల్ సాబ్ రూ.40.10 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టాయి. దాదాపు రూ.250కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన వీరమల్లు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.102 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ లెక్కన చూసుకుంటే.. తెలుగు రాష్ట్రాలలో వీరమల్లు లాభాల్లోకి రావాలంటే రూ.103కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.210 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. మరి ఈ నెగిటివ్ టాక్ మధ్య ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.