హెచ్‌‌పీతో ర్యాపిడో ఒప్పందం.. రైడర్స్ కి స్పెషల్ ఆఫర్స్..

హెచ్‌‌పీతో ర్యాపిడో ఒప్పందం.. రైడర్స్ కి స్పెషల్ ఆఫర్స్..

హైదరాబాద్, వెలుగు: రైడ్-షేరింగ్ ప్లాట్‌‌ఫామ్ ర్యాపిడో, తన బైక్ టాక్సీ, క్యాబ్ కెప్టెన్లకు వాహన నిర్వహణ ప్రయోజనాలను అందించేందుకు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్​పీసీఎల్​)తో గురువారం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని  ప్రకటించింది.  ఈ కార్యక్రమం మొదట హైదరాబాద్‌‌లో మొదలయింది. రానున్న రోజుల్లో  భారతదేశంలోని 11 నగరాలకు విస్తరించనుంది.  

3.8 లక్షల మందికిపైగా కెప్టెన్లకు ఈ ఒప్పందం వల్ల మేలు జరుగుతుందని ర్యాపిడో  తెలిపింది. హైదరాబాద్‌‌లోని అన్ని హెచ్‌‌పీసీఎల్ స్టేషన్లలో ఇంధనంపై 1.25శాతం తగ్గింపు ఉంటుంది.  హెచ్‌‌పీ లూబ్రికెంట్, వాహన్ కిట్‌‌పై 50శాతం తగ్గింపు ఇస్తారు. హైదరాబాద్‌‌లోని 300కుపైగా హెచ్‌‌పీసీఎల్ బంకుల్లో ఈ ప్రయోజనాలు  పొందవచ్చు.