
ఇండియన్ స్టార్ హీరో కమలహాసన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేశారు. 2025, జూలై 25వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో రాజ్యసభకు వచ్చిన ఆయనతో.. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు డిప్యూటీ చైర్ పర్సన్ హరివంశీ.
తమిళనాడు రాష్ట్రం నుంచి అధికార డీఎంకే పార్టీ మద్దతులో.. కమలహాసన్ రాజ్యసభకు ఎంపిక అయ్యారు. తమిళ బాషలోనే ప్రమాణం చేశారాయన. ప్రమాణ స్వీకారం తర్వాత ఎంపీగా తొలి సంతకం చేశారు కమలహాసన్. ఎంపీగా ఎన్నిక అయిన కమలహాసన్ కు రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్ హరివంశీతోపాటు ఇతర సభ్యులు అభినందనలు చెప్పారు.
నేను ప్రమాణ స్వీకారం చేసి నా పేరును నమోదు చేసుకున్నాను.. ఒక భారతీయుడిగా.. నేను నా విధిని నిర్వర్తిస్తాను అంటూ కామెంట్ చేశారు కమలహాసన్.
2018లో MNM అనే పార్టీని స్థాపించి.. ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కమలహాసన్. ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ క్రమంలోనే తర్వాత ఎన్నికల్లో అంటే.. గత ఎన్నికల్లో వ్యక్తిగత రాజకీయ లాభం కంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యం అంటూ డీఎంకే పార్టీకి మద్దతు ఇచ్చారు. డీఎంకే పార్టీ గెలిచిన తర్వాత.. ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు సీఎం స్టాలిన్.