
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. దేశంలో అడల్ట్ కంటెంట్ పై కొరఢా దెబ్బలు కొట్టింది. ఎంతో పాపులర్ అయిన అడల్ట్ కంటెంట్ యాప్స్ అన్నింటినీ బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు 2025, జూలై 25వ తేదీన.. దేశంలోని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అందరికీ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆదేశాలతో దేశంలో 24 అడల్ట్ కంటెంట్ యాప్స్ పై నిషేధం విధించారు.
అడల్ట్ కంటెంట్ యాప్స్ బ్యాన్ అయిన వాటిలో.. ఎంతో పాపులర్ అయిన ఉల్లూ(ULLU), ALTT, Big shots వంటివి కూడా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 67, 67ఏ, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 294, మహిళలను అసభ్యకరంగా చూపించటాన్ని తప్పుబడుతూ సెక్షన్ 4 కింద.. ఈ 24 యాప్స్ పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ALSO READ : 30 వేల అడుగుల ఎత్తులో.. విమానంలోనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. పురుడుపోసిన ఫ్లయిట్ క్యాబిన్ క్రూ సిబ్బంది
బ్యాన్ అయిన అడల్ట్ కంటెంట్ యాప్స్ ఇవే :
ALTT, ULLU, Big Shots App, Desiflix, Boomex, Navarasa Lite, Gulab App, Kangan App, Bull App, Jalva App, Wow Entertainment, Look Entertainment, Hitprime, Feneo, Showx, Sol Talkies, Adda Tv, Hotx VIP, Hulchul App, Moodx, Neonx VIP, Fugi, Mojflix, Triflicks
ఈ 24 యాప్స్, వెబ్ సైట్స్ లో అడల్ట్ కంటెంట్ ఉందని.. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో నిషేధం విధించినట్లు ప్రకటించింది కేంద్రం. ఈ యాప్స్ ను వెంటనే తమ తమ ఫ్లాట్ ఫాం నుంచి తొలగించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది కేంద్రం.
అడల్ట్ కంటెంట్ వల్ల యువత చెడిపోతుందని.. అసభ్యకరమైన దృశ్యాలు, శృతిమించిన శృంగారం కంటెంట్ యువతతోపాటు సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కొన్ని రోజులుగా ప్రభుత్వానికి అభ్యంతరాలు, డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విచారణ చేసిన సమాచార మంత్రిత్వ శాఖ.. ఈ యాప్స్ పై బ్యాన్ విధించింది. దేశంలో ఎంతో పాపులర్ అయిన ఉల్లూ యాప్ కూడా నిషేధం జాబితాలో ఉంది.