30 వేల అడుగుల ఎత్తులో.. విమానంలోనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. పురుడుపోసిన ఫ్లయిట్ క్యాబిన్ క్రూ సిబ్బంది

30 వేల అడుగుల ఎత్తులో.. విమానంలోనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. పురుడుపోసిన ఫ్లయిట్ క్యాబిన్ క్రూ సిబ్బంది

భూమికి 30 వేల అడుగుల ఎత్తు.. గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న విమానం.. మస్కట్ నుంచి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లయిట్.. ఈ విమానంలో థాయ్ లాండ్ దేశానికి చెందిన ఓ మహిళ గర్భిణిగా ఫ్లయిట్  ఎక్కింది. మస్కట్ నుంచి ముంబై మీదుగా బ్యాంకాంగ్ వెళ్లటానికి ప్లాన్ చేసుకున్నది ఆ మహిళ.. గర్బిణి అయిన ఆ మహిళకు డెలివరీ డేట్ మరో 10 రోజులు ఉంది.. సో.. ఇబ్బంది ఏమీ లేదని విమానం ఎక్కేసింది..

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లయిట్ మస్కట్ నుంచి ముంబై వస్తున్న సమయంలో.. భూమికి 30 వేల అడుగుల ఎత్తులో ఉంది. ముంబై రావటానికి మరో వెయ్యి కిలోమీటర్లు.. కనీసం గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంది. సరిగ్గా అప్పుడే.. గర్బిణిగా ఉన్న ఆ థాయ్ మహిళకు నొప్పులు వచ్చాయి. నొప్పులు ఓర్చుకోవాలని.. మరో గంటలో ముంబైలో ఫ్లయిట్ ల్యాండ్ అవుతుందని ఆమెను ఓదార్చారు.. అయినా నొప్పులు అంతకంతకు ఎక్కువ అయ్యాయి.. 

ఫ్లయిట్ లో ఉన్న సిబ్బందిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. వాళ్లే డాక్టర్లు, నర్సులు అయ్యారు. సీనియర్ క్యాబిన్ మెంబర్ అయిన స్నేహ చొరవ తీసుకుని.. ఆమెకు సాయం చేశారు. విమానంలో ప్రసవానికి కావాల్సిన స్థలాన్ని డిసైడ్ చేసి.. ఫస్ట్ ఎయిడ్ కిట్ తో.. ఆమెకు పురుడు పోశారు. పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ థాయ్ మహిళ. 

ALSO READ : 5.4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం కాళ్లు తీయించుకున్నడు

ఈలోపు పైలెట్లు ముంబై ఎయిర్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ముంబైలో ల్యాండ్ కావటానికి వెంటనే అనుమతి ఇవ్వాలని.. విమానంలో జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో ముంబైలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ల్యాండింగ్ కు వెంటనే అనుమతి లభించింది. అప్పటికే డాక్టర్లు, అంబులెన్స్ సిద్ధం చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే.. తల్లి, బిడ్డను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ప్రకటించిన డాక్టర్లు.. విమానంలో క్యాబిన్ క్రూ సిబ్బంది చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు. 

ముంబైలోని థాయ్ లాండ్ కాన్సులేట్ జనరల్ కు విషయాన్ని వివరించారు ఎయిర్ పోర్ట్ అథారిటీ వారు. తల్లితోపాటు బిడ్డకు ఇప్పుడు తాత్కాలిక పాస్ పోర్ట్ రెడీ చేసి.. తిరిగి థాయ్ లాండ్ పంపించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స తర్వాత.. డాక్యుమెంట్లు రెడీ చేసి పంపించటానికి వారం రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు..

విమానంలో మహిళ డెలివరీ.. ఆడ బిడ్డకు జన్మనివ్వటం అనేది మిరాకిల్ అంటున్నారు నెటిజన్లు. సరైన సమయంలో.. సరైన రీతిలో స్పందించిన ఫ్లయిట్ క్యాబిన్ క్రూకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.