క్లాసులు జరుగుతుండగా..కూలిన స్కూల్ పైకప్పు.. ఏడుగురు విద్యార్థులు మృతి,15మందికి గాయాలు

క్లాసులు జరుగుతుండగా..కూలిన స్కూల్ పైకప్పు.. ఏడుగురు విద్యార్థులు మృతి,15మందికి గాయాలు

రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం(జూలై25) ఉదయం క్లాసులు నడుస్తుండగా ఆకస్మికంగా భవనం పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

రాజస్థాన్ లోని ఘలావర్ జిల్లాలోని పిస్లోడి ప్రాథమిక పాఠశాలలో పైకప్పు కూలిపోయింది. శుక్రవారం ఉదయం విద్యార్థులకు క్లాసులు జరుగుతుండగా ఒక్కసారిగా భవనం పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు అక్కడకక్కడే చనిపోగా.. మరో 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.  

సమాచారం అందుకున్న వెంటనే రక్షణ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల నుంచి గాయపడిన వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. 

పాఠశాల భవనం పాత భవనం కావడంతో పైకప్పు కూలిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.

►ALSO READ | ఈ ఫారెస్ట్ ఆఫీసర్ ఇంట్లో రూ. కోటిన్నర నగదు, గోల్డ్ కాయిన్స్ ఎక్కడిది. ? విజిలెన్స్ సోదాల్లో షాకింగ్ విషయాలు..

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.