అలా ఎలా ఎక్కించావురా: హైదరాబాద్ లో గోడ ఎక్కిన కారు.. అసలేం జరిగిందంటే.. ?

అలా ఎలా ఎక్కించావురా: హైదరాబాద్ లో గోడ ఎక్కిన కారు.. అసలేం జరిగిందంటే.. ?

హైదరాబాద్ లో ఓ కారు గోడ ఎక్కింది... కారు గోడ ఎక్కడం ఏంటి అనుకుంటున్నారా..? అది తెలియాలంటే శుక్రవారం ( జులై 25 ) హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభీపూర్ లో జరిగిన ఈ ఘటన గురించి తెలియాలి. శంబీపూర్ లో శుక్రవారం అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. డివైడర్ ను ఢీకొట్టి ఓ ఇంటి గోడపై పార్క్ అయ్యింది కారు. మద్యం మత్తులో కారు నడపటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలవ్వగా.. మరొకరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును కిందికి దింపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.