
బ్రిటన్: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ కెరీర్లో 38వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు సంబంధించిన ఓ కీలకమైన రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. అదేంటంటే.. టెస్ట్ క్రికెట్‌లో స్వదేశంలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్ల జాబితాలో సచిన్‌ను అధిగమించడం.
స్వదేశంలో 94 టెస్టుల్లో 22 సెంచరీలు చేశాడు సచిన్. మాంచెస్టర్లో జరుగుతోన్న సెంచరీతో సొంతగడ్డపై 23 సెంచరీలు పూర్తి చేసుకున్న రూట్.. సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా స్వదేశంలో టెస్టుల్లో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో మహేళ జయవర్థనే (23), జాక్వెస్ కల్లిస్ (23)తో కలిసి సంయుక్తంగా రూట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
►ALSO READ | క్రికెట్‌కు వేద కృష్ణమూర్తి గుడ్ బై.. అస్సలు ఊహించలేదంటూ ఎమోషనల్ పోస్ట్
ఇక, మ్యాచ్ విషయానికొస్తే మాంచెస్టర్ టెస్ట్‌పై ఇంగ్లాండ్ పట్టు బిగిస్తోంది. రూట్ సెంచరీతో చెలరేగగా.. ఓపెనర్లు డకెట్ (94), క్రాలీ (8), ఓలీ పోప్ (71) అర్థ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. క్రీజులో రూట్119, బెన్ స్టోక్స్ 33 ఉన్నారు. ఫస్ట్ ఇన్సింగ్స్ లో టీమిండియా 358 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్ 70 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
సొంత మైదానంలో అత్యధిక టెస్ట్ సెంచరీలు:
1 జో రూట్: 84 మ్యాచ్‌ల్లో 23 సెంచరీలు
2 మహేల జయవర్ధనే: 81 మ్యాచ్‌ల్లో 23 టన్నులు
3 జాక్వెస్ కల్లిస్: 88 మ్యాచ్‌ల్లో 23 సెంచరీలు
4 రికీ పాంటింగ్: 92 మ్యాచ్‌ల్లో 23 సెంచరీలు
5 సచిన్ టెండూల్కర్: 94 మ్యాచ్‌ల్లో 22 సెంచరీలు