
న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా శుక్రవారం (జూలై 25) రిటైర్మెంట్ ప్రకటన చేశారు. ‘‘పెద్ద కలలతో ఓ చిన్న టౌన్ నుంచి వచ్చి బ్యాట్ పట్టుకున్నప్పుడు ఎక్కడి వరకు వెళ్తానో నాకు తెలియదు. కానీ, ఆటను ప్రేమించడమే మాత్రమే నాకు తెలుసు. ఇరుకైన వీధుల్లో నుంచి పెద్ద స్టేడియాలకు, భారత జెర్సీ ధరించే వరకూ తీసుకెళ్తుందని నేను అస్సలు ఊహించలేదు.
క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. ఎలా పోరాడాలో, పడిపోయినప్పుడు తిరిగి ఎలా పుంజుకోవాలో నేర్పింది. అందుకు నేను ఎంతో రుణపడి ఉన్నా. నాకు ఎంతో ఇచ్చిన ఆటకు ఇప్పుడు నేను తిరిగిచ్చే సమయం ఆసన్నమైంది. ఈ రోజు మనస్ఫూర్తిగా క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నా. నా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆశాజనంకగా ఉంటుందని ఆశిస్తున్నా’ అంటూ ఎమోషనల్‌గా వీడ్కోలు ప్రకటన చేశారు వేద కృష్ణమార్తి.
కాగా, కర్నాటకు చెందిన వేద కృష్ణమూర్తి 2011లో జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు తొమ్మిదేళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించిన వేద భారత్ తరపున 47 వన్డేలు, 76 టీ20లు ఆడి 1,693 రన్స్ చేసింది. వన్డే, టీ20లు ఆడిన వేదకృష్ణమూర్తి భారత్ తరుఫున టెస్టులు మాత్రం ఆడలేదు. 2017 ప్రపంచ కప్, 2020 T20 ప్రపంచ కప్‌లో భారత జట్టులో ఆమె సభ్యురాలు.
►ALSO READ | ENG vs IND: ద్రవిడ్, కల్లిస్‌ను బీట్ చేసిన రూట్: ఇక సచిన్ ఆల్ టైమ్ రికార్డ్‌పైనే కన్ను
ఆమె చివరిసారిగా MCGలో జరిగిన 2020 T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడం, యువ ప్లేయర్ల రాకతో జట్టులో స్థానం కోసం తీవ్రంగా పోటీ పెరగడంతో ఆమెకు అవకాశం దక్కలేదు. ఈ క్రమంలోనే వేద కృష్ణమూర్తి క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.