ENG vs IND: ద్రవిడ్, కల్లిస్‎ను బీట్ చేసిన రూట్: ఇక సచిన్ ఆల్ టైమ్ రికార్డ్‎పైనే కన్ను

ENG vs IND:  ద్రవిడ్, కల్లిస్‎ను బీట్ చేసిన రూట్: ఇక సచిన్ ఆల్ టైమ్ రికార్డ్‎పైనే కన్ను

బ్రిటన్: ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్‎లో తన హవా కొనసాగిస్తున్నాడు. రెడ్ బాల్ క్రికెట్‎లో వేల కొద్ది పరుగులు చేస్తూ దిగ్గజాల రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాటర్‎గా రికార్డ్ సృష్టించాడు. మాంచెస్టర్ వేదికగా ఇండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో రూట్ ఈ ఘనత సాధించాడు.

 తద్వారా భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ (13288 రన్స్), దక్షిణాఫ్రికా గ్రేట్ ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లిస్ (13289) రికార్డును బద్దలు కొట్టి టెస్ట్ క్రికెట్‏లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‎కు ముందు టెస్టుల్లో మోస్ట్ రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో ఈ ఇంగ్లీష్ బ్యాటర్ మూడో స్థానంలో ఉన్నాడు. రాహుల్, కల్లిస్‎ను అధిగమించి మూడో స్థానానికి చేరుకోవడానికి 31 పరుగులు అవసరం కాగా మాంచెస్టర్ టెస్టులో 31 పరుగులు చేసి రాహుల్, కల్లిస్‎ ద్వయాన్ని బీట్ చేశాడు రూట్. 

టెస్టు క్రికెట్‎లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇక రూట్ కంటే సచిన్, రికీ పాటింగ్ మాత్రమే ఉన్నారు. 15921 పరుగులతో అత్యధిక టెస్ట్ రన్స్ చేసిన జాబితాలో సచిన్ టాప్ ప్లేసులో కొనసాగుతుండగా.. 13378 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్. రూట్, పాంటింగ్ మధ్య కూడా కొన్ని పరుగుల తేడా మాత్రమే ఉండటంతో ఆస్ట్రేలియా ప్లేయర్‎ను కూడా ఈ సిరీస్‎లోనే రూట్ అధిగమించే అవకాశం ఉంది. ఇది జరిగితే ఇక రూట్ లక్ష్యం సచిన్ ఆల్ టైమ్ రికార్డ్ పైనే. 

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు:

 

  • సచిన్ టెండూల్కర్    15921 పరుగులు
  • రికీ పాంటింగ్     13378 పరుగులు
  • జో రూట్    13294* పరుగులు
  • జాక్వెస్ కాలిస్     13289 పరుగులు
  • రాహుల్ ద్రవిడ్    13288 పరుగులు

  •