అరబ్ కంట్రీలో తెలంగాణ అమ్మాయికి వరకట్న వేధింపులు..

అరబ్ కంట్రీలో తెలంగాణ అమ్మాయికి వరకట్న వేధింపులు..

అరబ్ కంట్రీలో తెలంగాణ అమ్మాయి వరకట్న వేధింపులకు గురైంది. హైదరాబాద్‌ రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన సబా బేగంని అరబ్ కంట్రీ చెందిన ముక్తాదీర్ అనే వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం చేశారు. కట్నం తేలేదంటూ భర్త ముక్తాదీర్, అమ్మాయిని  చిత్ర హింసలు గురిచేశాడు. తిండికూడా పెట్టకుండా ఓ గదిలో బంధించి రబ్బర్ మ్యాట్‌తో ఆమెను భర్త చితకబాదాడు. గది నుంచి బయటకు రాకుండా.. కిటికీలన్నీ క్లోజ్ చేసి గదికి తాళం వేశాడు. సబా బేగం తన భర్త పెడుతున్న టార్చర్ ను వీడియో తీసి తల్లిదండ్రులకు పంపింది.

 తన కామ వాంఛ తీర్చుకున్నాక ప్రతి రోజు దాడికి పాల్పడుతున్నాడని వీడియోలో తెలిపింది. సబాకు ఒళ్లంతా దెబ్బలతో చిత్ర హింసలకు గురి చేశాడని తెలిపింది. వీడియో చూసిన తల్లిదండ్రులు తన కూతురుని కాపాడాలంటూ విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. అరబ్ కంట్రీ మక్కాలో ఉంటున్న తన‌ కూతురిని భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ లేఖలో తెలిపింది. కనీసం తన కూతురుతో మాట్లాడ నివ్వడం లేదని ఒళ్లంతా గాయాలవడంతో రక్తస్రావమై ఎక్కడికక్క గడ్డలు కట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది.