ఆసక్తిని పెంచేలా హారర్ థ్రిల్లర్ ‘2వ గది’

ఆసక్తిని పెంచేలా హారర్ థ్రిల్లర్ ‘2వ గది’

అక్షర్​ నాయుడు, అనుష్క, భవ్యశ్రీ, ఖుషీ కీలక పాత్రల్లో అక్షయ రూపొందిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘2వ గది’.  స్వాక్ష పిక్చర్స్​ పతాకంపై  స్వాతి నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ హారర్ ఎలిమెంట్స్‌‌తో సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.  ఎస్​ఎన్​ నజీర్ అందించిన ​ సంగీతం క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.

ఇక టీజర్ లాంచ్ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌కు దర్శకులు  రేలంగి నర్సింహారావు, వీరశంకర్​, నిర్మాతలు  ప్రసన్న కుమార్​, రామ సత్యనారాయణ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. అలాగే మహిళలు యాక్టింగ్​లోనే కాకుండా దర్శక నిర్మాతగా కూడా  రాణిస్తారని చెప్పడానికి ఈ చిత్రమే  నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో  ‘బలగం’ ఫేమ్​ సంజయ్​, డీవోపీ నవీన్, గేయ రచయితలు మాష్టార్​ జీ, అంబట్ల రవి, రవివర్మ  తదితరులు పాల్గొన్నారు.