అలర్ట్.. మరింత పెరగనున్న ఎండలు

అలర్ట్.. మరింత పెరగనున్న ఎండలు

రాష్ట్రంలో ఓ వైపు వానలు.. మరో వైపు ఎండలు దంచికొడుతున్నాయి.  అసలు ఇది ఎండకాలమా? వానకాలమా? అనే సందేహం కల్గుతోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత  పెరగనున్నాయని  వాతావరణ శాఖ తెలిపింది.  సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కవ నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది.  హైదరాబాద్ లో  42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

కరీంనగర్​ లో అత్యధికంగా 45.1 డిగ్రీలు

రాష్ట్రంలో ఆదివారం వర్షాలతో పాటు కొన్నిచోట్ల ఎండలు కూడా దంచికొట్టాయి. కరీంనగర్​ కలెక్టరేట్​ వద్ద అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం, నిర్మల్​ జిల్లా లింగాపూర్​లో 44.9 డిగ్రీలు, ఆదిలాబాద్​ జిల్లా చాప్రాల, మంచిర్యాల జిల్లా కొమ్మెరల్లో 44.8, వీణవంకలో 44.6, రాజన్న సిరిసిల్ల జిల్లా మార్తాన్​పేట, కామారెడ్డి జిల్లా సర్వాపూర్, ఆదిలాబాద్​ జిల్లా అర్లిటిలో 44.5, సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 44.4 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. హైదరాబాద్​ గచ్చిబౌలిలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఎండల తీవ్రత దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే, రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు.