వింటర్ సీజన్ కావడంతో దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాజస్థాన్ లో వింటర్ సీజన్ ప్రారంభమయ్యాక మొదటి సారి జీరో డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. మౌంట్ అబూ హిల్ స్టేషన్ లో మంచు గడ్డలు కట్టింది.. గత కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్ నెల మధ్య నుంచి మంచు గడ్డకట్టిందని స్థానికులు తెలిపారు.
అయితే ఈ ఏడాది మాత్రం డిసెంబర్ నెల ప్రారంభంలోనే మంచు గడ్డ కడుతుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 8 నగరాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 5 నుంచి రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

