V6 News

భారత్ – అర్జెంటీనా మధ్య కుదిరిన 10 ఒప్పందాలు

భారత్ – అర్జెంటీనా మధ్య కుదిరిన 10 ఒప్పందాలు

భారత్ – అర్జెంటీనా బంధం మరింత బలోపేతమైంది. 10 రంగాల్లో రెండు దేశాల మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. 3 రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిసియో మాక్రి… ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. రక్షణ రంగంలో సహకారం అందించుకోవాలని రెండు దేశాలు MOUలపై సంతకాలు చేశాయి. పర్యాటక రంగంలోనూ సహకారంపై ఒప్పందం కుదిరింది. ప్రసార భారతి, అర్జెంటీనా ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ మీడియాకు మధ్య మరో ఎంవోయూ కుదిరింది. ఫార్మా రంగంలో మరొకటి, అంటార్కిటిక్ కో ఆపరేషన్ పై ఇంకో ఎంవోయూ కుదిరింది. కీలకమైన సివిల్ న్యూక్లియర్, వ్యవసాయం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లోనూ ఒప్పందాలు కుదిరాయి. భారత్, అర్జెంటీనా బంధం బలమైందని అన్నారు ప్రధాని మోడీ.

ప్రపంచ శాంతికి ఉగ్రవాదం తీరని ముప్పుగా మారిందన్నారు ప్రధాని మోడీ. పాకిస్తాన్ తో చర్చలకు టైం గడిచిపోయిందన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఒక్కటి కావాలన్నారు మోడీ. ఉగ్రవాదులకు సహకరించే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భారత్ అర్జెంటీనా మధ్య 10 రంగాల్లో ఎంవోయూలు కుదరడం సంతోషకరమన్నారు అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిసియో మాక్రి. పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ తో కలిసి పని చేస్తామన్నారు మాక్రి. మౌరీసియో మాక్రీకి రాష్ట్రపతి భవన్ లో ఘనస్వాగతం పలికారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మాక్రీకి గౌరవ వందనం సమర్పించాయి బలగాలు.