కరీంనగర్ 151 షాపులకు టెండర్ నోటిఫికేషన్

కరీంనగర్ 151 షాపులకు టెండర్ నోటిఫికేషన్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ బల్దియా పరిధిలో కొత్తగా నిర్మించిన 151పట్టర్లను లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు కమిషనర్ బి. శ్రీనివాస్ శుక్ర వారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో సివిల్ హాస్పిటల్ పరిధిలో 126 షాపులు, శాతవాహనయూనివర్సిటీపరిధిలో 25 షాపులు ఉన్నాయి. వీటిని ఐదేళ్ల కాల పరిమితితో వీటిని కేటాయించనున్నారు. మార్చి 1న ఉదయం 11 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో లాటరీ నిర్వహించను న్నారు. 

ఈ లాటరీ డ్రా పద్ధతిలో పాల్గొనాలకునే స్ట్రీట్ వెండర్లు తమ అప్లికేషన్ తోపాటు ఐడెంటిటీ కార్డు/ సర్టిఫికెట్ తో పాటు, రిజర్వేషన్ పొందాలనుకునే వారు క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డును సమర్పించాలి. అలాగే కమిషనర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పేరిట తీసిన రూ.1000 డీడీని అప్లికేషన్ తో జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డ్రాలో షాపు దక్కపో తే డీడీని వాపస్ చేయనున్నారు. బల్దియా రెవెన్యూ విభాగంలో ఈ నెల 27 వరకు రూ.100 చెల్లించి అప్లికేషన్ పొందవచ్చు. ఈ అప్లికేషన్లను 28వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అందజేయాల్సి ఉంటుంది.