ఫ్యూచర్ సిటీ బిల్డింగ్కు టెండర్లు..అక్టోబర్ 10 వరకు గడువు

ఫ్యూచర్ సిటీ బిల్డింగ్కు టెండర్లు..అక్టోబర్ 10 వరకు గడువు

హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ(ఎఫ్ సీడీఏ) బిల్డింగ్ నిర్మాణానికి కమిషనర్ శశాంక బుధవారం  టెండర్లు పిలిచారు. టెండర్ల దాఖలకు వచ్చే నెల 10 వరకు గడవు ఇవ్వగా అదే రోజు సాయం త్రం ఓపెన్ చేయనున్నట్టు నోటిఫికేషన్​లో కమిషనర్ పేర్కొన్నారు. 

రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం మీర్ఖాన్ పేట్(ఫ్యూచర్ సిటీ)లో అథారిటీ భవన నిర్మాణాన్ని రూ.19 కోట్లతో  చేపట్టనున్నారు. అయితే ఫ్రీకాస్టింగ్ తో మూడు నెలల్లో ఆఫీసు భవనాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది.