హైదరాబాద్‌లో చలో లోక్‌భవన్’ ఉద్రిక్తంగా మారింది. సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు లోక్‌భవన్ ముట్టడికి యత్నించారు. అయితే భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ ఆందోళనలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి అజారుద్దీన్‌తో, పాటు పలువురు ఎమ్మెల్యేలు, కోదండరాం, కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. లోక్‌భవన్ వైపు వెళ్లేందుకు నేతలు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విపక్ష నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పీసీసీ చీప్ సహా పలువురు మంత్రులను, ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు విపక్ష నేతలను పోలీసులు వాహనాల్లో తరలించారు. దీంతో లోక్‌భవన్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
