ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు..మల్కాజిగిరిలో ఉద్రిక్తత

ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు..మల్కాజిగిరిలో ఉద్రిక్తత

మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి చౌరస్తాలో ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ బుధవారం ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు, పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టామని, గతంలో పలుమార్లు హెచ్చరించినా వ్యాపారులు స్పందించలేదని మున్సిపల్ అధికారులు తెలిపారు.

ఈ కూల్చివేతలను సీపీఎం నాయకులు, వ్యాపారులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పేద వ్యాపారుల పొట్ట కొట్టవద్దని, ప్రత్యామ్నాయం చూపకుండా తమ ఉపాధిని దెబ్బతీయడం అన్యాయమని బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిరసనల మధ్యే పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి ఆక్రమణల తొలగింపు ప్రక్రియను పూర్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.