పరీక్షలు బాగా రాయండి : పది పరీక్షలకు అంతా సిద్ధం

పరీక్షలు బాగా రాయండి : పది పరీక్షలకు అంతా సిద్ధం

హాజరుకానున్న 1,90,328 మంది స్టూడెంట్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో శుక్రవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 1,90,328 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్​రాయనున్నారు. వీరిలో హైదరాబాద్‌‌ జిల్లాలో 77,701, రంగారెడ్డి జిల్లాలో 51,794, మేడ్చల్‌‌– మల్కాజిగిరి జిల్లాలో 47,930, వికారాబాద్​జిల్లాలో 12,903 మంది ఉన్నారు. ఏప్రిల్​4 వరకు ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఒక్కో ఎగ్జామ్​హాల్​లో 20 మంది విద్యార్థులను కేటాయించారు. హెచ్ఎం ఆఫీస్​లో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పరీక్ష పేపర్లు తెరవడం, జవాబు పత్రాలు సీల్ చేయడాన్ని మానిటరింగ్​చేయనున్నారు. కాపీయింగ్​జరగకుండా సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. సెంటర్ల వద్ద సిబ్బంది మొబైల్ ఫోన్లు వాడొద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రశ్నాపత్రంపై ఈసారి క్యూఆర్ కోడ్, సీరియల్ నంబర్​ఉండనుంది. దీనివల్ల ఎక్కడైనా ప్రశ్నాపత్రం లీక్ అయితే వెంటనే తెలిసిపోతుందని అధికారులు తెలిపారు.