ఇల్లు కోసం కూడబెట్టిన రూ.5 లక్షలకు చెదలు

V6 Velugu Posted on Feb 17, 2021

సొంత ఇల్లు కట్టుకోవాలని ట్రంకు పెట్టేలో దాచుకున్న డబ్బులు చెదలు పట్టడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు కృష్ణాజిల్లా మైలవరానికి చెందిన జమలయ్య. మైలవరం వాటర్ ట్యాంక్ దగ్గర పందుల వ్యాపారం చేస్తుంటాడు బిజిలి జమలయ్య.బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో వ్యాపారంలో వచ్చిన డబ్బును ట్రంకు పెట్టెలో దాచుకున్నాడు. మొత్తం ఐదు లక్షల రూపాయల వరకు కూడా బెట్టాడు. 10 లక్షల వరకు సంపాదించి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు జమలయ్య. ఈ మధ్య అర్జెంట్ గా లక్ష రూపాయలు అవసరం కావడంతో ట్రంక్ పెట్టే తెరిచాడు. అయితే  పెట్టెలోని డబ్బులు చెదలు పట్టి చిరిగిపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. సొమ్మసిల్లి కిందపడిపోయాడు. చిరిగిన నోట్లతో పిల్లలు ఆడుకోవడం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఈ డబ్బు జమలయ్య సొంతమా?  ఎక్కడి నుంచైనా తెచ్చారా? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

see more news

మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.. వరుసగా తొమ్మిదోసారి

పాల వ్యాపారం కోసం హెలికాప్టర్ కొన్న రైతు

మార్చిలో భూమి దగ్గరగా ఆస్టరాయిడ్‌‌ ..

Tagged money, House, Krishna District, 5lakhs, Mylavaram, termites

Latest Videos

Subscribe Now

More News