జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడి..ముగ్గురు జవాన్లు వీరమరణం

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడి..ముగ్గురు జవాన్లు వీరమరణం

జమ్ముకశ్మీర్ రాజౌరీలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందగా..ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దర్హాల్ ప్రాంతం పర్గల్లోని ఆర్మీ బేస్ క్యాంపే లక్ష్యంగా టెర్రరిస్టులు ఆత్మహుతి దాడికి యత్నించారు. ఆర్మీ క్యాంప్ ఫెన్సింగ్ దాటుకుని లోపలకు చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించిగా.. ఆర్మీ సెంట్రీ గమనించి కాల్పులు జరిపారు.  ఇరు వర్గాల మధ్య భారీస్థాయిలో కాల్పులు జరిగాయి. వీరమరణం పొందిన జవాన్లను రాజేంద్ర ప్రసాద్, మనోజ్ కుమార్,  లక్ష్మణన్ లుగా గుర్తించారు. ఇద్దరు జవాన్లకు సైతం గాయాలయ్యాయి.

చనిపోయిన టెర్రరిస్టుల దగ్గర భారీగా ఆయుధాలు ఉన్నట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఎదురుకాల్పులు జరిగిన పరిసరాల్లో ఇంకా ఎవరైనా ఉన్నారనే అనుమానంతో భద్రతా సిబ్బంది విస్తృతంగా సోదాలు చేపడుతున్నారు. 25 కిలోమీటర్ల వరకు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 

భద్రతా కట్టుదిట్టం

కొన్నాళ్లుగా జమ్మూకశ్మీర్ లో టెర్రర్ ఆపరేషేన్ కొనసాగుతోంది. బుధవారం కూడా భారీ ఉగ్రకుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి . పుల్వామాలో 30 కిలోల పేలుడు పదార్థాలను భద్రతాబలగాలు సీజ్ చేశాయి. మరోవైపు పంద్రాగస్టు సందర్భంగా కశ్మీర్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. రైల్వే స్టేషన్లలో నిఘా పెట్టారు. ఉధంపూర్ కాట్రా రైల్వే లింక్ దగ్గర భారీగా బలగాలు మోహరించాయి.