కాశ్మీర్‎లో టెర్రరిస్ట్ అరెస్ట్: పహల్గాంలో దాడి చేసినోడిగా అనుమానం

 కాశ్మీర్‎లో టెర్రరిస్ట్ అరెస్ట్: పహల్గాంలో దాడి చేసినోడిగా అనుమానం

ఇది ఇండియా బిగ్ బ్రేకింగ్.. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని టూరిస్టులపై టెర్రరిస్టులు దాడి చేసిన ఘటనలో.. మన భారత సైన్యం కీలక ముందడుగు వేసింది. టెర్రిస్టుల కోసం జమ్మూకాశ్మీర్‎ను జల్లెడ పడుతున్న సమయంలో.. ఓ టెర్రరిస్టు మన ఆర్మీ చేతికి చిక్కాడు. ఆ టెర్రరిస్టు పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒకడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చేస్తుంది మన ఆర్మీ.

జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో నరమేధం సృష్టించి 26 మంది అమాయక ప్రజలను  టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. అత్యంత పాశవికంగా అమాయక ప్రజల ప్రాణాలు తీసిన  ఉగ్రమూకల కోసం భారత భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఉగ్రవాదులు ఏ మూలన ఉన్న పట్టుకోవాలని అణవుఅణువునా జల్లెడ పడుతున్నాయి. టెర్రర్ ఎటాక్ జరిగిన బైసరన్ లోయ చుట్టూ ఉన్న అడవుల్లో మంగళవారం ( మే 6)  భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.

ఈ క్రమంలోనే భద్రతా దళాలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉన్న ఓ అనుమానాస్పద వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అతడిని అహ్మద్ బిలాల్‎గా గుర్తించారు. బిలాల్ కు పహల్గాం ఉగ్రదాడి ఘటనతో సంబంధం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎక్కడి నుంచి వచ్చిందని అధికారులు ప్రశ్నంచగా.. సంబంధం లేని ఆన్సర్లు చెప్పినట్లు తెలిసింది.