నైగర్‌‌లో టెర్రర్​ దాడి..12 మంది సోల్జర్లు మృతి

నైగర్‌‌లో   టెర్రర్​ దాడి..12 మంది సోల్జర్లు మృతి

నియామీ: వెస్ట్ ఆఫ్రికా దేశమైన నైగర్‌‌లో  దారుణం జరిగింది. కందాడ్జీలోని తిల్లబెరి రీజియన్ టౌన్ వద్ద గురువారం గస్తీ నిర్వహిస్తున్న సోల్జర్లపై అల్ ఖైదా, ఐఎస్ గ్రూపునకు చెందిన వందలాది మంది టెర్రరిస్టులు ఒక్కసారిగా ఎటాక్ చేశారు. ఈ దాడిలో 12 మంది జవాన్లు చనిపోగా..మరో ఏడుగురు గాయపడినట్లు నైగర్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది. సైనికులు జరిపిన ఎదురు కాల్పుల్లో 100 మంది టెర్రరిస్టులు కూడా హతమైనట్లు వెల్లడించింది. 

తిల్లబెరి వద్ద మిషన్‌‌లో ఉన్న సైనికులను బైక్‌‌లపై వచ్చిన వందలాది మంది ఇస్లామిక్ టెర్రరిస్టులు ఒక్కసారిగా చుట్టుముట్టి ఎటాక్ చేశారని  నైగర్‌‌ డిఫెన్స్ మినిస్టర్, జనరల్ సాలిఫౌ మోదీ వెల్లడించారు. టెర్రరిస్టులకు, జవాన్లకు మధ్య భీకరమైన కాల్పులు జరిగాయన్నారు. ఈ దాడిలో గాయపడిన సోల్జర్లకు ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ అందుతోందని తెలిపారు. 100 మంది టెర్రరిస్టులను చంపామనివివరించారు.

 నైగర్‌‌పై ఏండ్లుగా అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధమున్న టెర్రరిస్టుల దాడులు చేస్తున్నారు. ఆ దేశంలో  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్‌‌పై జులైలో సైనికులు తిరుగుబాటు చేసి..సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 
టెర్రరిస్టుల దాడులు మరింత పెరిగాయి.