గాంధీలో‌‌‌‌ 713 మందికి పరీక్షలు.. 203 మందికి‌‌‌‌ బీపీ, షుగర్

గాంధీలో‌‌‌‌ 713 మందికి పరీక్షలు.. 203 మందికి‌‌‌‌ బీపీ, షుగర్

సొంత హెల్త్‌‌‌‌పై నిర్లక్ష్యంతోనే అనారోగ్య సమస్యలు

హైదరాబాద్, వెలుగు: పనిభారం, ఒత్తిడి కారణంగా డాక్టర్లు, హెల్త్ స్టాఫ్  కూడా దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో వారికి బీపీ, షుగర్‌‌‌‌‌‌‌‌ వంటి డిసీజ్‌‌‌‌లు వస్తున్నాయి. వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా సోమవారం గాంధీ ఆస్పత్రిలో నిర్వహించిన హెల్త్ క్యాంపులో డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌కు బీపీ, షుగర్‌‌‌‌‌‌‌‌ టెస్టులు చేశారు. ఇదివరకు బీపీ, షుగర్ లేని 713 మంది టెస్టులు చేయించుకోగా, అందులో 203 మంది (28%)కి ఆ రెండూ ఉన్నట్టు తేలింది. ఇంత మంది తమ ఆరోగ్యంపై అజాగ్రత్తగా ఉండడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని గాంధీ సూపరింటెండెంట్‌‌‌‌ డాక్టర్ రాజారావు అన్నారు. ప్రతి ఒక్కరూ రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా చెకప్స్ చేయించుకోవాలని సూచించారు. హెల్త్ కేర్ వర్కర్లలోనే ఈ స్థాయిలో అన్‌‌‌‌డయాగ్నైజ్‌‌‌‌డ్ డిసీజ్‌‌‌‌ ఉంటే.. ప్రజల్లో ఇంకా ఎక్కువే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. బీపీ, షుగర్ వంటి జబ్బులకు మొదట్లో సింప్టమ్స్ ఏమీ ఉండవని, ప్రతి ఒక్కరు టెస్టులు చేయించుకోవడం ద్వారానే ముందుగా గుర్తించడానికి వీలవుతుందని తెలిపారు.

వరుస ఘటనలు

తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూపల్లి రాజేందర్ సడెన్ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌తో15 రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయారు. గాంధీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ డెర్మటాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్న డాక్టర్‌‌‌‌‌‌‌‌ రఘుపతిరెడ్డి రెండ్రోజుల క్రితం సడెన్ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌తో ఇంట్లోనే చనిపోయారు. అంతకుముందు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కార్పొరేషన్ ఎండీ కొడుకు సైతం సడెన్ స్ట్రోక్​తో మృతి చెందారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో డాక్టర్లు, హెల్త్ వర్కర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నలుగురు హెల్త్ కేర్ వర్కర్లలో ఒకరు జబ్బులతో ఇబ్బంది పడుతున్నట్లు గతంలో చేసిన సర్వేల్లో వెల్లడైంది. సెల్ఫ్ హెల్త్‌‌‌‌‌‌‌‌ను నిర్లక్ష్యం చేయడమే కారణమని హెల్త్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌ చెప్తున్నారు.