మేం బాగుండాలి.. మా ఊరు బాగుండాలి

మేం బాగుండాలి.. మా ఊరు బాగుండాలి
  • సెల్ఫ్ లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన వ‌స్త్ర వ్యాపారులు
  • ఉదయం 10 గం.ల నుండి సాయత్రం 5 గం.ల వరకు షాపులు మూసివేత
  • గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్వ‌చ్చందంగా లాక్‌డౌన్

వరంగల్ : కరోనా భారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సెల్ప్ లాక్ డౌన్ విదించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1768 గ్రామ పంచాయితీల ప్రజలు లాక్ డౌన్ పాటించారు. ప్రభుత్వం అంత‌కుముందు లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వటం తో ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హించారు. కారణంగా కరోనా కేసులు వందల సంఖ్యలో పెరుగుతున్నాయి. దీంతో స్వీయ నియంత్రణ పాటించడం ద్వారానే త‌మ‌ని తాము కాపాడుకోగలుగుతామని…నిర్ణయం తీసుకున్నారు అక్క‌డి మార్కెట్‌లోని వస్త్ర దుకాణాల వ్యాపారులు. వ్యాపారంలో నష్టపోతామని తెలిసీనప్పటికి… కస్టమర్లు, తమ కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సెల్ఫ్ లాక్‌డౌన్‌ పాటించాలని నిర్ణయించుకున్నామని వారు చెబుతున్నారు.

వ్యాపారులే కాదు పల్లె ప్ర‌జ‌లు కూడా స్వ‌చ్ఛందంగా  గ్రామాల్లో కమిటీలు వేసుకుని లాక్ డౌన్  పాటిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట, పరకాలలో ఉదయం 10 గంటల నుండి సాయత్రం 5 గంటల వరకు షాపులు తెరిచి మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఉదయం 7 గంటల నుండి సాయత్రం 6 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి.. వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌డౌ న్‌ ప్రకటిస్తున్నారు.

వరంగల్ నగర సమీపంలోని అరెపల్లి, పైడిపల్లి,సిద్దాపురం గ్రామాల్లోని షాపులు ఉదయం 9 నుండి సాయత్రం 5 గంటల వరకు తీయాలని, అ తరువాత మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నామ‌ని అక్క‌డి వ్యాపారులు అంటున్నారు. సెల్ప్ లాక్ డౌన్ తో మేం భాగుండాలి,మా ఊరు భాగుండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. కరోనా కట్టడి కోసం త‌మ‌ గ్రామంలోకి ఎవరు వచ్చినా మాస్క్ లు దరించాలని, టెస్టులు చేసుకుని రావాలని నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. వచ్చిన వారు కూడ హోంక్వారంటైన్ లో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించక పోవటం,మాస్క్ లు దరించని కారణంగా కరోనా కేసులు పెరిగి పోతున్నాయి.కరోనా భారిన పడకుండా ఉండటం కోసం తమ పల్లెలు,పట్టణాలు అనే తేడా లేకుండా సెల్ప్ లాక్ డౌన్ లు విధించుకుంటున్నారు. అందరూ కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని తీర్మానాలు చేసుకుంటున్నారు.  క‌రోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి పల్లె,పట్టణ ప్రజలందరితో ప్రజలు తీసుకుంటున్న నిర్ణయాలతో కరోనాను గ్రామాల్లోని రాకుండా కట్టడి చేస్తున్నారు. ఐకమత్యంతో కలిసి ముందుకు సాగుతున్నారు.