సీపీగెట్ రెండో విడతలో 9,367 మందికి సీట్లు 

సీపీగెట్ రెండో విడతలో 9,367 మందికి సీట్లు 

హైదరాబాద్, వెలుగు: వివిధ యూనివర్సిటీల పరిధిలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం తదితర పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సీపీగెట్– 2026 రెండో విడత సీట్లను కేటాయించారు. కన్వీనర్ కోటా కింద మొత్తం 36,269 సీట్లు అందుబాటులో ఉండగా.. వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న 15,269 మంది అభ్యర్థుల్లో 9,367 మందికి సీట్లు కేటాయించినట్టు అడ్మిషన్ల కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించి, అధికారిక వెబ్‌‌‌‌సైట్ నుంచి ఫీజు పేమెంట్ రసీదును డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 9వ తేదీలోగా కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. 

ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. 

పీజీ కోర్సులకు సంబంధించి తుది విడత షెడ్యూల్‌‌‌‌ను​ రిలీజ్ చేశారు. దీంతో పాటు ఎంఎడ్, ఎంపీఎడ్ కోర్సుల మొదటి విడత ప్రవేశాల ఆన్‌‌‌‌లైన్ రిజిస్ట్రేషన్ల షెడ్యూల్‌‌‌‌ను కూడా కన్వీనర్ ప్రకటించారు. అర్హత కలిగిన అభ్యర్థులకు ఈనెల 6 నుంచి 9 వరకు ఆన్‌‌‌‌లైన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 7 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించగా, 14న ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.