మే 18న టీజీ లాసెట్ ..పెనాల్టీతో మే 15 వరకు దరఖాస్తుకు చాన్స్

మే 18న టీజీ లాసెట్ ..పెనాల్టీతో మే 15 వరకు దరఖాస్తుకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ లాసెట్, పీజీఎల్‌‌‌‌ సెట్-–2026 పరీక్షను ఈనెల 18న మూడు సెషన్లలో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ బి.విజయలక్ష్మి తెలిపారు. ఇప్పటివరకు 66,620 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. మూడేండ్ల ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌బీ కోర్సు కోసం రెండు సెషన్లలో, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, పీజీ కోర్సులకు కలిపి మూడో సెషన్స్​లో పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు.

అభ్యర్థులు తమ హాల్‌‌‌‌టికెట్లను మే 12 నుంచి వెబ్‌‌‌‌సైట్ ద్వారా డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రూ.4 వేల ఫైన్​తో మే 13 వరకు, రూ.10 వేల పెనాల్టీతో మే 15 వరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకోవచ్చని తెలిపారు. కాగా, మూడేండ్ల కోర్సుకు 47,400 మంది, ఐదేండ్ల కోర్సుకు 14,020 మంది, పీజీ కోర్సులకు 5,200 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు.