- 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు పొంది ఇప్పటికే రిపోర్ట్ చేసిన విద్యార్థులు తమ బ్రాంచ్ మార్చుకునేందుకు టెక్నికల్ ఎడ్యుకేషన్ అవకాశం కల్పించింది. టీజీ పాలిసెట్అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్‌ను కన్వీనర్ ఎ.శ్రీదేవసేన శుక్రవారం విడుదల చేశారు.
విద్యార్థులు చేరిన కాలేజీలోనే ఇతర బ్రాంచ్‌ల్లో ఖాళీగా ఉన్న సీట్లను పొందేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడనుంది. ఇంటర్నల్ స్లైడింగ్ కింద బ్రాంచ్ మార్చుకోవాలనుకునే ఈనెల 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా జూన్ 30 వరకు సీట్లను కేటాయించనున్నారు.
