ఉప్పల్ స్టేడియంలో ఉప్పొంగిన ఉత్సాహం

ఉప్పల్ స్టేడియంలో ఉప్పొంగిన ఉత్సాహం
  • రాహుల్ సిప్లిగంజ్ మ్యూజిక్​ మ్యాజిక్​.. విజయ్ , అఖిల్​ సందడి

హైదరాబాద్ సిటీ, వెలుగు:  ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో ఆదివారం తెలంగాణ టీజీ టీ20 క్రికెట్ లీగ్ ముగింపు వేడుకలు సినీ గ్లామర్, తెలంగాణ సంస్కృతి కలగలిసి అత్యంత వైభవంగా జరిగాయి. ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌‌‌‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హిరో అక్కినేని అఖిల్, ఆది, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఇతర నటులు సందడి చేశారు. మ్యాచ్ కు వేలాది మంది అభిమానులు హాజరు కాగా.. కేరింతలు, ఈలలతో ఉప్పల్ గ్రౌండ్ మార్మోగింది. 

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనదైన మాస్ జానపద గీతాలు, హై-ఎనర్జీ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. రంగురంగుల బతుకమ్మలు, బోనాలు, జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆధునిక క్రికెట్ హంగులకు, మన అచ్చమైన స్థానిక కళలు, ఫ్లడ్‌‌‌‌లైట్ల వెలుతురులో సాగిన ఈ ముగింపు వేడుకలు క్రీడాభిమానులకు అద్భుత అనుభూతిని మిగిల్చాయి.