- ఇప్పటి వరకు 93,513 అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు: టీజీ టెట్ -జూన్ 2026 దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు అభ్యర్థులకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. బుధవారం నుంచి అప్లికేషన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తెస్తున్నట్టు టెట్ కన్వీనర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు మే 3వ తేదీ వరకు అధి కారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా తమ దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని సూచిం చారు.
మరోవైపు టెట్ దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు గడువు ఈ నెల30 తో ముగియనుంది. మంగళవారం మధ్యాహ్నం వరకూ మొత్తం 93,514 దరఖాస్తులు వచ్చాయని కన్వీనర్ వెల్లడించారు. ఇందులో పేపర్–-1 కు 21,826 మంది, పేపర్-–2 కు 59,271 మం ది, రెండు పేపర్లకు కలిపి 12,417 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.

