టీజీటెట్ ఇన్‌‌ సర్వీస్ దరఖాస్తులు షురూ..

టీజీటెట్ ఇన్‌‌ సర్వీస్ దరఖాస్తులు షురూ..

హైదరాబాద్, వెలుగు: ఇన్‌‌సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించే స్పెషల్ టీజీటెట్ దరఖాస్తుల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు సాయంత్రం నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 988 మంది టీచర్లు అప్లై చేశారు. 

దీనిలో పేపర్–-1 కోసం 136 మంది, పేపర్–-2 కోసం 709 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, రెండు పేపర్లు రాసేందుకు 143 మంది ఇన్‌‌సర్వీస్ టీచర్లు అప్లై చేసుకున్నారు. ఈనెల 16 వరకూ దరఖాస్తులకు అవకాశం ఉంది.