- స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు టీజీహెచ్‌ఎంఏ వినతి
హైదరాబాద్, వెలుగు: టీచర్లు, హెడ్మాస్టర్ల బదిలీలకు కనీస సర్వీస్ అర్హతగా ఉన్న రెండేండ్ల నిబంధనను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ (టీజీహెచ్ఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్రకాశ్, ముఖ్య సలహాదారు డాక్టర్ పార్వతి సత్యనారాయణ కోరారు. ఈ మేరకు గురువారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
దశాబ్దాలుగా ఒకేచోట రెండేండ్లు పనిచేసిన వారికి బదిలీలకు అవకాశం ఉండేదని, కానీ ఇటీవల ప్రభుత్వం ఈ పరిమితిని మూడేండ్లకు పెంచడం సరికాదన్నారు. అకస్మాత్తుగా నిబంధనలు మార్చడం వల్ల వేలాది మంది టీచర్లు, హెడ్ మాస్టర్లు అనిశ్చితికి గురవుతున్నారని పేర్కొన్నారు.
