- టీజీపీఏఎల్ఏ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ కాలేజీలను ‘శక్తి’ శాఖలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను మానుకోవాలని పాలిటెక్నిక్ కాలేజీల అధ్యాపకుల సంఘం (టీజీపీఏఎల్ఏ) నేతలు కోరారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో లంచ్ బ్రేక్‌లో లెక్చరర్లు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య అనేది పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే ఒక ప్రత్యేక వ్యవస్థ అని పేర్కొన్నారు.
ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, స్కిల్ యూనివర్సిటీలు.. ఇలా వేర్వేరు లక్ష్యాలు, అకడమిక్ ప్రమాణాలు కలిగిన సంస్థలను ఒకే శాఖ పరిధిలోకి తీసుకురావడంతో పాలిటెక్నిక్ విద్య ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
