గ్రూప్-2 అభ్యర్థులకు TGPSC బిగ్ అప్డేట్

గ్రూప్-2 అభ్యర్థులకు TGPSC బిగ్ అప్డేట్

హైదరాబాద్: గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ షెడ్యూల్ ఖరారు చేసింది. 2025, మే 29వ తేదీ నుంచి 2025, జూన్ 10వ తేదీ వరకు గ్రూప్ 2 అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తామని తెలిపింది. హైదరాబాద్‎లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్శిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపింది.

 సర్టిఫికెట్ వెరిఫికేషన్‎కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ సంతకం చేసిన జిరాక్స్‏లు తీసుకురావాలని సూచించింది. నిర్ధిష్ట తేదీలలో ఏదైనా కారణం వల్ల సర్టిఫికేట్ హాజరుకాలేని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందించామని.. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా.. ఇతర వివరాలు కావాలన్న కమిషన్ అధికారిక వెబ్‎సైట్‎ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించింది టీజీపీఎస్సీ. 

కాగా, రాష్ట్రవ్యాప్తంగా 783 గ్రూప్– 2 పోస్టుల భర్తీకి నిరుడు డిసెంబర్ 15, 16 తేదీల్లో ఎగ్జామ్ జరిగింది. దీనికి 5,51,855 మంది అప్లై చేసుకోగా.. వారిలో 2,49,964 మంది అభ్యర్థులు 4 పరీక్షలకు అటెండ్ అయ్యారు. వీరిలో 2,36,649 మందికి జనరల్ ర్యాకింగ్ లిస్ట్‎ను కమిషన్ ప్రకటించింది. 

మరో 13,315 మంది క్యాండిడేట్ల పేపర్లు ఇన్​వ్యాలిడ్​అయ్యాయని వెల్లడించింది. 2025, మార్చి 11న ఫైనల్ కీతో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్​(జీఆర్ఎల్​)ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా విడుదల చేసింది. ఓఎంఆర్ షీట్, మాస్టర్​క్వశ్చన్​పేపర్‎​ను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో అందుబాటులో ఉంచింది.