ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటది: టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి

ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటది: టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఈ ఒక్క ఏడాది కోసం కాదని, వచ్చే ఏడాది మరో జాబ్ క్యాలెండర్ కూడా ఉంటుందని, ఉద్యోగులు అందుకు అనుగుణంగా పని చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (టీజీపీఎస్సీ) మహేందర్ రెడ్డి అన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌ను అనుకున్న సమయానికి పూర్తి చేయాలంటే, కమిషన్ ఉద్యోగులు తమలోని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని టీజీపీఎస్సీ ఆఫీసులో జాతీయ పతాకాన్ని కమిషన్ సెక్రటరీ, సభ్యులు, ఉద్యోగులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో కమిషన్ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలని కోరారు. కమిషన్ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తే , ప్రతి నియమకాల్లో ఎలాంటి కోర్టు కేసులు ఉండవని , ప్రతిభ ఉన్న క్యాండిడేట్స్‌‌‌‌ను ఎంపిక చేయవచ్చునన్నారు. అందుకోసం ఉద్యోగులకు స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ తరగతులను ప్రతి రోజు నిర్వహించేలా చూడాలని సెక్రటరీకు ఆయన సూచించారు.